బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామానికి చెందిన బోగారం మైసమ్మ మృతిపై స్థానిక నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చిట్టేడి జనార్దన్ రెడ్డి మరియు చిట్టేడి దామోదర్ రెడ్డి రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అండగా నిలుస్తామని, ధైర్యంగా ఉండాలని వారు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు బండారు నరసింహారెడ్డి, చిట్టేడీ రామచంద్రారెడ్డి, వలిగొండ మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు చిలకమర్రి కనకాచారి, మాజీ ఎంపీటీసీలు బైకాని ముత్యాలు, పోలేపాక చంద్రయ్య, మాజీ సర్పంచ్‌లు జినుకల దానయ్య, పోలేపాక చెమ్మయ్య, ఆరూరు మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు నిమ్మల రవికుమార్, మాజీ మత్స్యగిరి గుట్ట డైరెక్టర్ బండి రవికుమార్, మాజీ స్కూల్ చైర్మన్ ఆవుల అంజయ్య, మాజీ పాలసొసైటీ చైర్మన్ జక్కిడి నర్సిరెడ్డి, కొయ్యగూర మధు, జినుకల ఉదేశ్, కొత్తకాపు నర్సిరెడ్డి, చిలకమర్రి లక్ష్మణచారి, బోగారం యాదయ్య, బోగారం లక్ష్మయ్య తదితరులు పాల్గొని మృతురాలికి శ్రద్ధాంజలి ఘటించారు.



