కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం

కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు పవన్ కల్యాణ్. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపిస్తారు.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు పవన్ కల్యాణ్. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానించనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరమని అభిప్రాయపడ్డారు. అనంతరం చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

Read More జన సైనికురాలి కుటుంబానికి 5 లక్షల చెక్ అందించిన నాగబాబు

 

WhatsApp Image 2024-06-11 at 11.19.43 AM

మరోవైపు జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌ను ఏక్రగీవంగా ఎన్నకున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ శాసనసభా పక్ష ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. అధిష్టానం ప్రకటనకు కట్టుబడి ఉండాలని సూచించారు. శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొని అభిప్రాయాలను వివరిస్తామని వెల్లడించారు.

Related Posts