లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించిన కొల్లే సరితా తిరుపతయ్య
విశ్వంభర/ లాల్ దర్వాజా :- దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైనా అన్నపూర్ణాదేవి రూపం లో భాగంగా గొర్రెల& మేకల చైర్మన్ (జోగులాంబ గద్వాల) కొల్లె సరిత తిరుపతయ్య లాల్ దర్వాజా సింహవాహిని అమ్మ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ఒడి బియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు. కొల్లె సరిత మాట్లాడుతూ ఎలినోవ ప్రభావం వల్ల రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు నెలకొనకుండా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు . ఇంతకు మునుపు బోనాల పండక్కి రావడం జరిగిందని మళ్లీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాల్ దర్వాజా కమిటీ మెంబర్స్ మాణిక్ ప్రభు, ఏ వినోద్ కుమార్, ఏ చందు, చిట్టెం శ్యామ్ రావు, అదిగల మణికి రావు, రాజు యాదవ్, ముత్యం యాదవ్, తేజ, శ్రీనాథ్ కుర్మా తదితరులు తదితరులు పాల్గొన్నారు.



