కొండా లక్ష్మణ్ బాపూజీనీ భారతరత్నగా ప్రకటించాలి. - బొంగు వెంకటేష్ గౌడ్, అధ్యక్షులు,బీసీ పీపుల్స్ ఫెడరేషన్ 

కొండా లక్ష్మణ్ బాపూజీనీ భారతరత్నగా ప్రకటించాలి. - బొంగు వెంకటేష్ గౌడ్, అధ్యక్షులు,బీసీ పీపుల్స్ ఫెడరేషన్ 

విశ్వంభర, హైదరాబాద్ :-ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి. సందర్భంగా ఎల్‌బీనగర్‌లో బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘురాం నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగిందికొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, ప్రజానాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు. చిన్ననాటి నుంచే సామాజిక అన్యాయాలు, వెట్టి చాకిరీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచారు. స్వాతంత్ర్యోద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు.1952లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1967లో భువనగిరి నుంచి కూడా శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా నిలిచిన బాపూజీ, అప్పటి మంత్రివర్గంలో ఉన్నప్పటికీ మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమంలోకి వచ్చారు. ఆయన అరెస్టై జైలుకు వెళ్లినా ఉద్యమాన్ని కొనసాగించారు. అందుకే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన త్యాగం ప్రత్యేకంగా గుర్తించబడింది..

బీసీ ఉద్యమానికి ఆయన వారసత్వం
బాపూజీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా మాత్రమే కాకుండా, వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక పురోగతికి కృషి చేసిన ప్రజానాయకుడిగా కూడా గుర్తించబడుతున్నారు. 

Read More ఈ నెల 22న రాప్తాడుకు మంత్రి నారా లోకేష్.. ఏర్పాట్లను పరిశీలించిన పరిటాల శ్రీరామ్

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఎల్‌బీనగర్‌లో బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘురాం నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ...
కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజానాయకుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన రాజకీయ పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడని అన్నారు.
1915 సెప్టెంబర్ 27న వాంకిడిలో జన్మించిన బాపూజీ చిన్ననాటి నుంచే ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. స్వాతంత్ర్యోద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని ప్రజల పక్షాన నిలిచారు.
1952లో ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, అనంతరం డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమైన సమయంలో మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలి తెలంగాణ సాధన కోసం ఉద్యమంలోకి రావడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు.


కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు వర్ధిల్లాలి!
సామాజిక న్యాయం సాధించాలి!
బీసీల ఐక్యత వర్ధిల్లాలి!
జై బీసీ! జై బహుజన!!
  
          బీసీ పీపుల్స్ ఫెడరేషన్ 
               అధ్యక్షులు.
         బొంగు వెంకటేష్ గౌడ్.
          98 48 50 69 14

Tags: