ఆంధ్రా బ్యాంక్ ఎన్‌క్లేవ్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
విశ్వంభర, హయత్‌నగర్: ఆంధ్రా బ్యాంక్ ఎన్‌క్లేవ్ , హయత్‌నగర్ రోడ్ నెం 5, సుధీర్ ఫౌండేషన్ సమీపంలో ఆంధ్రా బ్యాంక్ ఎన్‌క్లేవ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. కాలనీ వాసులు, యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలు మరియు రన్నర్స్‌కు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాలు కాలనీ వాసుల్లో ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపాయి. ఈ సందర్భంగా బహుమతుల స్పాన్సర్‌గా నన్నూరి శ్రీకాంత్ రెడ్డి గారు సహకారం అందించారు. గణేష్ విగ్రహ దాతలుగా జాన్ రెడ్డి మరియు శిరీష తమ సహకారాన్ని అందించారు. అలాగే గణేష్ లడ్డూ దాతగా పాంపారు శ్రీకాంత్ వ్యవహరించారు. ఈ ఏడాది నిర్వహించిన శ్రీ గణేష్ లడ్డూ వేలంలో కేతావత్ కృష్ణ , లలిత లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ వేలం కార్యక్రమం కాలనీ వాసుల సమక్షంలో ఎంతో ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దాతలు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున సహకరించారు. సుమారు 900 మందికి అన్నదానం నిర్వహించారు. సుధీర్ ఫౌండేషన్‌తో పాటు ఇతరులకు కూడా అన్నప్రసాదాన్ని అందించారు. ఈ సేవా కార్యక్రమాన్ని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ గణేష్ ఉత్సవాల విజయానికి కోటేశ్వరరావు, బోనం రాము, కృష్ణ యాదవ్, పగిడి సుమన్, ఆదిశేషు, జయరాయుడు, కె. కృష్ణ, బాలరాజు గౌడ్, స్వామి, జాన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, దేవరపల్లి అండాలు తదితరులు ప్రత్యేకంగా పాల్గొని తమ సహకారం అందించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆంధ్రా బ్యాంక్ ఎన్‌క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు సమిష్టిగా కృషి చేయడంతో ఉత్సవాలు ఘనంగా, విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కాలనీ వాసుల ఐక్యత, సహకారం, ఆప్యాయతలే ఈ ఉత్సవాల విజయానికి ప్రధాన కారణం. ఉత్సవాలను విజయవంతం చేసిన దాతలు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, యువత, మహిళలు, చిన్నారులు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు”అని తెలిపారు.



