పట్టభద్రుల ఎన్నికలకు సిద్ధం కావాలి. - ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
కేసీఆర్ పై అభిమానాన్ని ఓటు రూపంలో మలుచుకుందాం:
విశ్వంభర, మీర్ పెట్ :-రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ సామ యాదిరెడ్డి గార్డెన్స్‌లో మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన మహేశ్వరం నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి, అర్హత ఉన్న వారందరి ఓట్లను పెద్ద ఎత్తున నమోదు చేయించేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తలందరి సహాయ సహకారాలు, కృషితో సురభి వాణీదేవిని గెలిపించుకోవడం జరిగిందని గుర్తుచేశారు. అదే పోరాట స్ఫూర్తితో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేసి పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, జిల్లెల్ల కృష్ణారెడ్డి, జయేందర్, దీప్ లాల్, లక్ష్మీ నరసింహ రెడ్డి ,అర్జున్, అర్కల భూపాల్ రెడ్డి , అర్కల కామేష్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, కొండల్ రెడ్డి, అంకిరెడ్డి , పెండ్యాల నగేష్, సాజిద్,
అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



