ఘనంగా పండుగల సాయన్న జయంతి ఉత్సవాలు

జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి

ఘనంగా పండుగల సాయన్న జయంతి ఉత్సవాలు

విశ్వంభర, చేవెళ్ళ: పండుగల సాయన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.పండుగల సాయన్న జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ వైభవ్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు

Tags: