కోటమైసమ్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ
విశ్వంభర/లాల్ దర్వాజా :-దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కోట మైసమ్మ యూత్ అసోసియేషన్ బాల గంజ్, లాల్ దర్వాజాలో పెద్ద ఎత్తున అన్నదాన నిర్వహించారు. అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూదుర్గామాతను రెండవసారి నెలకొల్పాము గడిచిన ఏడాది కంటే ఈసారి కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగాయని, మా కమిటీకి 50 మంది సభ్యులు ఉన్నారని, ప్రతిరోజు అమ్మవారికి నిత్య పూజలు, పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, పెద్దలకు దాండియా, తెలంగాణ సంస్కృతి నిదర్శనమైన బొడ్డెమ్మలు, జాగరణ కార్యక్రమాలు, అమ్మవారి సరస్వతి రూపంలో కొలువైన రోజు పిల్లలకు పెన్సిల్లు పెన్నులు,బుక్స్, పలకలు, బలపములు, అక్షరాభ్యాసములు కూడా, నిర్వహించామని, అలాగే ఈరోజు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించామని, అమ్మవారి జలప్రవేశం హుస్సేన్ సాగర్ లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోజ్, అవినాష్, చింటూ, అజయ్, అభి, రోహిత్, హరి,శంకర్,స్వర్ణలత, హేమలత,సుప్రియ, చిట్టి, అనిషా, మహానందా, అమ్ములు, మీనా, కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.



