సన్ షైన్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు
విశ్వంభర,చండూరు:- మున్సిపాలిటీలోని సన్ షైన్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లోని విద్యార్థినీ విద్యార్థులు సేకరించిన వివిధ రకాల పూలను అందంగా బతుకమ్మల రూపంలో పేర్చి పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ , ఉపాధ్యాయురాళ్ళు, విద్యార్థినులు అందరూ కలిసి బతుకమ్మల ఆటపాటలతో పాఠశాల ప్రాంగణంలో ఉత్సాహకరమైన ఆనందోత్సవ వాతావరణంలో బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ తొమ్మిది రోజులు బతుకమ్మలను ఏ విధంగా నిర్వహిస్తారు మరియు ఒక్కొక్క రోజు బతుకమ్మకు గల పేర్లను వివరిస్తూ బతుకమ్మ విశిష్టతను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో ఐదు అడుగుల బతుకమ్మను పేర్చిన విద్యార్థినీ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవికాంత్, వైస్ ప్రిన్సిపాల్ వినయ్, బతుకమ్మ నిర్వాహకులు రమేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



