మానవత్వం చాటుకున్న చేపూరి శంకర్
On
విశ్వంభర, హైదరాబాద్ :-వికారాబాద్ మోటుపల్లికి చెందిన ఫోజియా బేగంకు ప్లేట్లెట్స్ పడిపోవడంతో బ్లడ్ కూడా 4.9 ఉండడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో బ్లడ్ ఎమర్జెన్సీ ఉందని సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ కు ఫోన్ చేయగానే 20 నిమిషాల్లో ఏబీ పాజిటివ్ బ్లడ్ ను చేపూరి శంకర్ అందజేయడం ద్వారా ఫోజియా బేగం కు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు నుండి ఉచితంగా అందజేశారు. సకాలంలో బ్లడ్ అందించిన శంకర్ కు కుటుంబ సభ్యులు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు మానవసేవే మాధవసేవ అని, మదర్ థెరిస్సా స్పూర్తితో ఎంతోమందికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్నామని చేపూరి శంకర్ తెలిపారు.



