మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా.. షాబాద్‌లో సేవా సంకల్ప్ అభియాన్
విశ్వంభర, షాబాద్:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్–అంగన్ మిలన్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి మమతా మోహన్ రెడ్డి గురువారం షాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా నాగర్‌గూడ, తాళ్లపల్లి, మక్తగూడ, దొస్వాడ, తిమ్మారెడ్డిగూడ తదితర గ్రామాల్లో పర్యటించిన ఆమె అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి, అంగన్‌వాడీ టీచర్లను సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల సంరక్షణ, పోషణ, విద్య కోసం అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆమె అభినందించారు.ఈ కార్యక్రమంలో షాబాద్ మండల బీజేపీ యువ నాయకులు తాళ్ల నవీన్ గౌడ్, వంశీ, చంద్రశేఖర్, నితీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సహకరించారు



