మహిషాసురమర్ధిని రూపంలో కొలువైన ఉప్పుగూడ మహంకాళి దేవాలయం
On
విశ్వంభర / ఉప్పుగూడ:-దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజున మహిషాసుర మర్దిని రూపంలో ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో నెలవై భక్తులకు దీవెనలు అందిస్తుంది. చైర్మన్ మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ ఈరోజు లలిత సహస్రనామం, మంటపారాధన, కుంకుమార్చన, మరియు హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అన్ని కుటుంబాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు.



