పాము కాటుతో మహిళ మృతి
On
విశ్వంభర/ రేకులంపల్లి, కౌ కుంట్ల:-శనివారం రాత్రి ఇంట్లోకి వచ్చిన పాము కాటు వల్ల తెలుగు లక్ష్మి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందు తు మంగళవారం మృతి చెందింది. మంగళవారం తిరిగి పార్థివ దేహాన్ని రేకులంపల్లి తీసుకురాగా మళ్లీ బుధవారం ఉదయం ఇంటి ముందు పాము సంచరించడం తో కట్లపాముగా నిర్ధారించి చంపారు. ఇలాంటి సంఘటనలు రేకులం పల్లిలో నిత్యంగా జరుగుతుంటాయని , పట్టించుకునే వార్డు నెంబర్ కానీ సర్పంచ్ గాని లేరని వచ్చిన బంధువులు, గ్రామస్తులు వాపోతున్నారు. తక్షణమే ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలుగు లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.



