21 ఏళ్లుగా వినాయకుడి లడ్డూను దక్కించుకుంటున్న కుటుంబం

రూ.1,11,111కు లడ్డూ కైవసం.. ఘనంగా వినాయక నిమజ్జనం

21 ఏళ్లుగా వినాయకుడి లడ్డూను దక్కించుకుంటున్న కుటుంబం

విశ్వంభర, షాద్‌నగర్:రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండల పరిధిలోని షాద్‌నగర్ పద్మావతి కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ వినాయక స్వామివారిని శనివారం భక్తుల సందడి నడుమ గంగమ్మ ఒడికి చేర్చారు.ఈ సందర్భంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంపాటలో బొంతపల్లి రాములు, మల్లమ్మ దంపతుల కుమారుడు బొంతపల్లి వీరయ్య గుప్త వరుసగా 21వ సంవత్సరం కూడా లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది రూ.1,01,111లకు లడ్డూను దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో వీరయ్య గుప్త కుమారుడు బొంతపల్లి దేవేందర్ గుప్త, మనుమడు బొంతపల్లి వికాస్ గుప్త, ఆయన తమ్ముళ్లు బొంతపల్లి వీరేశం గుప్త, బొంతపల్లి విద్యాసాగర్ గుప్తతో పాటు కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వినాయక స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

Tags: