నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల

తెలుగు సమాజ సేవలో యువత భాగస్వామ్యానికి ప్రాధాన్యం

నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల

విశ్వంభ‌ర‌, న్యూజెర్సీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) న్యూజెర్సీ చాప్టర్ నూతన నాయకుడిగా సాయి గంగుల నియమితులయ్యారు. నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల పాల్గొన్న ప్రత్యేక సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాజ్ అల్లాడ ఈ నియామకాన్ని ప్రకటించారు. యువ నాయకుడైన సాయి గంగుల నేతృత్వంలో న్యూజెర్సీ వ్యాప్తంగా నాట్స్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజ్ అల్లాడ మాట్లాడుతూ యువతను సామాజిక సేవలో భాగస్వాములను చేయడమే నాట్స్ ప్రధాన లక్ష్యమన్నారు. ఛైర్మన్ కిశోర్ కంచర్ల మాట్లాడుతూ నాట్స్ అభివృద్ధిలో న్యూజెర్సీ తెలుగు సమాజం కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ రాష్ట్రం నుంచి ముగ్గురు నాట్స్ అధ్యక్షులు రావడం విశేషమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆప్టా, ఆత్మీయ, మాటా, తానా, టీఫాస్, ఎన్‌ఆర్‌ఐవీఏ తదితర తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నాట్స్ ప్రతినిధులు బిందు యలమంచిలి, టీపీ రావు, శ్యామ్ నాళం, మురళీకృష్ణ మేడిచెర్ల, శ్రీనివాస్ భీమినేని, వంశీ కొప్పురావూరితో పాటు జాతీయ స్పాన్సర్లు శశి పర్వతం, కల్యాణ్ లక్కింశెట్టి తదితరులు హాజరయ్యారు. తెలుగు సంఘాలన్నీ ఐక్యంగా పనిచేయాలని, ముఖ్యంగా క్యాన్సర్‌పై అవగాహన, స్క్రీనింగ్ శిబిరాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని రాజ్ అల్లాడ పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో నాట్స్ కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా అవకాశాల కోసం natsnj@natsworld.org ద్వారా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Tags: