ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

రూ.2 లక్షలకు వినాయకుడి లడ్డూ ప్రసాదం కైవసం చేసుకున్న కుమ్మరి చెన్నయ్య

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

విశ్వంభర, షాబాద్: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ముద్దెంగూడ మాజీ ఎంపీటీసీ సభ్యులు కుమ్మరి చెన్నయ్య అన్నారు. గురువారం ముద్దెంగూడ గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుమ్మరి చెన్నయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని సూచించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

రూ.2 లక్షలకు లడ్డూ కైవసంవినాయకుడి లడ్డూ ప్రసాదానికి నిర్వహించిన వేలం పాటలో రూ.2 లక్షలకు మాజీ ఎంపీటీసీ సభ్యులు కుమ్మరి చెన్నయ్య లడ్డూను కైవసం చేసుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న చెన్నయ్యను ఆలయ నిర్వాహకులు పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో ముద్దెంగూడ సర్పంచ్ పర్వేద నర్సింహులు, సంకేపల్లిగూడ సర్పంచ్ కుమ్మరి లావణ్య, మాజీ ఎంపీపీ కూర వెంకటయ్య, మాజీ సర్పంచ్ సుదర్శన్, నాయకులు శేఖర్, శ్రీశైలం, శ్రీను, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More దసరా మామూళ్ల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు: త్రీటౌన్ సీఐ

Tags: