టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పడమటి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, గుత్తి రాఘవేందర్

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పడమటి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, గుత్తి రాఘవేందర్

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి కృషి చేస్తాం...*

*సంఘం రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి,జిల్లా అధ్యక్షుడు సలీం పాషా*

విశ్వంభర, చేవెళ్ల, (అక్టోబర్ 9): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) చేవెళ్ల నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన అధ్యక్షుడిగా పడమటి నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని వికారాబాద్ రోడ్డులో గల జీపీఆర్ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీమ్ పాషా మాట్లాడుతూ.... జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా కృషి చేస్తామని, ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులు కల్పించడం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించడం కోసం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఐక్యంగా పనిచేస్తూ యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

*నూతన కార్యవర్గం ఎన్నిక*

Read More పాము కాటుతో మహిళ మృతి

చేవెళ్ల నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పడమటి నరేందర్ రెడ్డి రాజ్ న్యూస్, ఉపాధ్యక్షులుగా గుత్తి శ్రీనివాసులు, బిగ్ టీవీ, గోంగుపల్లి రాఘవేందర్ 6టీవీ, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ టీవీ5, కార్యదర్శులుగా వామన్ రెడ్డి సాక్షి టీవీ, మహేష్ 99టీవీ, కోశాధికారిగా ఈపూరి రాఘవేంద్ర గుప్తా హెచ్ఎంటీవీ. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శ్రవణ్ కుమార్ ప్రైమ్9, ఈసీ సభ్యులుగా ఇస్మాయిల్ 4టీవీ, రమేష్ 10టీవీ, శివ ఎన్24, సుధాకర్ స్టార్9, శివారెడ్డి ఇండియన్ టుడే, ముస్తఫా ఎన్ టీవీ, బిక్షపతి మహా న్యూస్, ఎన్నికయ్యారు. జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంతోష్ ఏబీఎన్, జిల్లా కమిటీ ఈసీ మెంబర్ గా లంబాడి మల్లేష్ వి6, ఎంపికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పడమటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన యూనియన్ నాయకులకు, జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరినీ కలుపుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీశైలం, టీయూడబ్ల్యూజే చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు యాదయ్య, కార్యదర్శి గోపాల్, షాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ధర్పల్లి రవీందర్ గౌడ్, జిల్లా నాయకులు కరుణాకర్ చారి, దర్శనాల కృష్ణ, సంతోష్ కుమార్ చారి, మల్లేష్ గోపాల్ రావు, వికారాబాద్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గ రిపోర్టర్లు పూర్ణచందర్ గుప్త, రాజేష్, చంద్రశేఖర్, వినయ్‌తో పాటు పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు.

Tags:  

Advertisement

LatestNews

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పడమటి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, గుత్తి రాఘవేందర్
సన్ షైన్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా.. షాబాద్‌లో సేవా సంకల్ప్ అభియాన్
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. - కోడి శ్రీనివాసులు , మున్సిపల్ చైర్మన్ 
ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026
ఎరుకల సమస్యలపై  కలెక్టర్ కు వినతి 
వర్షాలు సమృద్ధిగా కురవాలి. -కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం ప్రత్యేక పూజలు*