విద్యార్థుల భవిష్యత్తుకు దాతల చేయూత
శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో సేవా కార్యక్రమం
షాద్నగర్ , విశ్వంభర: విద్యార్థుల విద్యాభ్యాసానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల నిర్వాహకులు పేర్కొన్నారు. షాద్నగర్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.పాఠశాల ప్రబంధకారిణి ఉపాధ్యక్షులు బొంతపల్లి విద్యాసాగర్ గుప్తా ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. అలాగే రియల్టర్ అరవింద్ పాఠశాల అవసరాల కోసం స్టేషనరీ కొనుగోలుకు రూ.3,000 నగదు విరాళంగా అందించారు.పదో తరగతి విద్యార్థులు స్టడీ అవర్స్‌లో చదువుకునేందుకు అవసరమైన అల్పాహారాన్ని బెజుగం రమేష్, ఎల్కుర్తి వీరేశం, పెద్ది రామ్మోహన్, యంసాని శ్రీనివాస్ , సురేష్ ,అందించారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి తమవంతు సహకారం అందించడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల శశిధర్, నాగిళ్ల కిషోర్ కుమార్, నందిగామ సురేష్, కిరణ్ కుమార్ రెడ్డి, పసుపుల వెంకటేష్ తదితరులతో పాటు పాఠశాల ప్రధానాచార్యులు వీరేష్ కుమార్ పాల్గొన్నారు.



