శ్రీ లక్ష్మనేశ్వరాలయంలో చండీ హోమం
విశ్వంభర/ చత్రినాక :- శ్రీ లక్ష్మనేశ్వరాలయము శివగంగ నగర్, చత్రినాకలో చండీ హోమం ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మా రెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మా దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు, ఉగాది నుంచి మొదలుకొని అన్ని పండుగ వేళలో కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందరి సహాయ సహకారాలతో కార్యక్రమాలు విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈరోజు మా రెడ్డి రాకేష్ రెడ్డి దంపతులు జి.అమర్ గౌడ్ దంపతులు,లక్ష్మణరావు దంపతులు, చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ సూరం సత్యనారాయణ, జి రాజ్యలక్ష్మి, సలహాదారులు కొల్లోజుశ్రీనివాస్ చారి, వరకా ల యాదగిరి, పుట్ట రాజు యాదవ్, విశ్వేశ్వరయ్య గుప్తా, డాక్టర్ సోమనాథ్ రావు, గుగ్గిల అశోక్ కుమార్ గుప్తా, షీలా రాములు గుప్తా, భవాని శంకర్ దేవాలయ అధ్యక్షుడు మధుసూదన్ రావు, మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.



