ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి- లక్ష్మీ దంపతులే మాకు ఆదర్శం - కోడి శ్రీనివాసులు- అరుణ దంపతులు
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం....
విశ్వంభర, చండూరు: ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో చండూరు మున్సిపల్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు 2024వ సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం శుక్రవారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు 33వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి- లక్ష్మీ దంపతులను ఆదర్శంగా తీసుకొని సేవ చేస్తున్నామని అన్నారు. మా జీవితం ఉన్నంతవరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ తో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాక వారి ముఖంలో చిరునవ్వు చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని, పేదలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మరి ఎక్కడ లభించదని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి సుష్మా వెంకన్న, కటకం రమేష్ లు మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, లక్ష్మీ దంపతులను ఆదర్శంగా తీసుకొని చండూరులో డాక్టర్ కోడి శ్రీనివాసులు-అరుణ దంపతులు గాంధీజీ ఫౌండేషన్ ప్రారంభించి 33 నెలలుగా సుమారు 15 లక్షల రూపాయల విలువచేసే నిత్యావసర సరుకులు నిరుపేదలకు అందించడం గర్వనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, కల్లెట్ల చంద్రకళ మారయ్య, షరీఫ్, పురోహితులు ప్రవీణ్ శర్మ, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, బోడ విజయ్, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి,గోపి తదితరులు పాల్గొన్నారు.



