మేదిని గ్రూప్ గణపతి లడ్డూ వేలం ₹2,51,116కు కైవసం

టీమ్ భరోసా, టీమ్ ఛాంపియన్స్, టీమ్ రుద్రవీణ, టీమ్ అచీవర్స్, టీమ్ యోధ హెడ్‌ల సంయుక్త విజయం

మేదిని గ్రూప్ గణపతి లడ్డూ వేలం ₹2,51,116కు కైవసం

విశ్వంభర, హైదరాబాద్: ప్రముఖ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ మేదిని గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన అష్ట ఐశ్వర్య గణపతి పూజ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలం ఉత్కంఠభరితంగా సాగింది.పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంలో మేదిని గ్రూప్‌కు చెందిన టీమ్ భరోసా హెడ్ సింగు శ్రీనివాస్ గారు, టీమ్ ఛాంపియన్స్ హెడ్ హరిప్రియ రెడ్డి గారు, టీమ్ రుద్రవీణ హెడ్ సంతోష్ వర్మ గారు, టీమ్ అచీవర్స్ హెడ్ మురళీ గారు, టీమ్ యోధ హెడ్ ఆంజనేయులు స్వామి గారు సంయుక్తంగా పాల్గొని ₹2,51,116కు గణపతి లడ్డూను కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా మేదిని గ్రూప్ చైర్మన్ వెంకటరమణ రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ (M.D.) యాతాకుల సిసింద్రీ గారు, బిజినెస్ గురు శ్రవణ్ వర్మ గారు పాల్గొని లడ్డూ వేలంలో విజయం సాధించిన టీమ్ హెడ్‌లను అభినందించారు.మేదిని గ్రూప్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణపతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సంస్థ అభివృద్ధి, ఉద్యోగులు మరియు అసోసియేట్స్ శ్రేయస్సు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మేదిని గ్రూప్ అధినేతలు మాట్లాడుతూ, సంస్థలోని ప్రతి సభ్యుడిని ఒక కుటుంబంగా భావిస్తూ, సంప్రదాయాలు–సంస్కృతిని గౌరవిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

Tags: