చందనవెల్లిలో ఘనంగా దుర్గామాత పూజలు, బతుకమ్మ సంబరాలు-సర్పంచ్ నవనీత స్వామి

చందనవెల్లిలో ఘనంగా దుర్గామాత పూజలు, బతుకమ్మ సంబరాలు-సర్పంచ్ నవనీత స్వామి

విశ్వంభర, షాబాద్ :- రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చందనవెల్లి గ్రామంలో సర్పంచ్ నవనీత స్వామి సార్ ఆధ్వర్యంలో దుర్గామాత పూజా కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విశ్వ దృక్ ఫౌండేషన్, అంద కళాకారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా కొనసాగాయి. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, ప్రజలు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి భక్తి పాటలు, బతుకమ్మ పాటలతో సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించడం విశేషంగా నిలిచింది.విశ్వ దృక్ ఫౌండేషన్, అంద కళాకారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ సంప్రదాయాలను కాపాడుతూ, ప్రజల్లో ఐక్యతాభావాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు.సర్పంచ్ నవనీత స్వామి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దుర్గామాత ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Tags: