ఘనంగా లడ్డు వేలం పాట - శ్రీశ్రీశ్రీ బంగారు పోచమ్మ రేణుక ఎల్లమ్మ దేవాలయం 

 కన్నుల పండగగా వరసిద్ధి వినాయక నిమజ్జనం 

ఘనంగా లడ్డు వేలం పాట - శ్రీశ్రీశ్రీ బంగారు పోచమ్మ రేణుక ఎల్లమ్మ దేవాలయం 

విశ్వంభర, ఎల్బీనగర్ /మన్సూరాబాద్ ;-  జడ్జెస్ కాలనీ ఫేస్ 1 కాలనీ లోని శ్రీశ్రీశ్రీ బంగారు పోచమ్మ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో కొలువైనటువంటి వరసిద్ధి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా లడ్డు వేలం పాట ఘనంగా నిర్వహించారు.  వినాయక మండపంలో 2 లడ్డులు, కలశం వేలం పాట దేవాలయాల కమిటీ మరియు కాలనీ కమిటీ ఆధ్వర్యంలో  చుట్టుపక్క ప్రాంత ప్రజల మధ్యలో వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాటలో  జడ్జెస్ కాలనీ ఫేస్ 1 కాలనీ బంగారు పోచమ్మ టెంపుల్ అధ్యక్షులు మోడల్ బిక్షపతి సాగర్ గారు 1,15,000 కు మొదటి లడ్డుని వేలం పాటలో కైవసం చేసుకున్నారు. రెండవ లడ్డు అయినటివంటి వంటి వేలంపాటలో జడ్జెస్ కాలనీ ఫేస్ 1 న్యూ వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రెటరీ తాళ్ల సుకుమార్ గారు 80,000 రూపాయలకు వేలంపాటల లడ్డూ ను కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 9 రోజులు పూజా కార్యక్రమం తర్వాత గణనాథుని కలశం వేలంపాటలో 1,45,001 కి వాయుపుత్ర ట్రావెల్స్ యజమాని బొంగు కృష్ణ గారు వేలంపాటలో తగ్గించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో  కాలనీ కమిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బకతట్ల శ్రీశైలం యాదవ్ , కాలనీ కమిటీ ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి , నిర్మాణ కమిటీ అధ్యక్షులు మారోజు షణ్ముఖ చారి , బంగారు పోచమ్మ దేవాలయం కమిటీ అధ్యక్షులు మోడల బిక్షపతి సాగర్ , శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షులు చింతల యాదయ్య , శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు దంతూరి బిక్షపతి గౌడ్ , గోశాల కమిటీ అధ్యక్షులు గార్లపాటి గోవింద్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శులు తాల్ల సుకుమార్ , యేల్లు మాధవ రెడ్డి , కోశాధికారులు రాపోలు గోపీనాథ్, బి చిన్నయ్య , ఉపాధ్యక్షులు బొంగు కృష్ణ , పి మోహన్ రావు , పి శివ ముకాడే, కాళ్ళ సుమంత్ , చల్లా రమేష్ , పి సతీష్, గవ్వ వెంకటరెడ్డి , సాగర్ల శంకర్ , జగదీష్ యాదవ్ , టీ సతీష్,వి రాజీవ్ కుమార్ ,  మహిళా కమిటీ సభ్యులు ఎస్ కృష్ణమ్మ , అశోక్ కుమారీ , యం వెంకటమ్మ , బి లావణ్య , సుగుణమ్మ ,  గోవర్ధనమ్మ,  డి మహేశ్వరి ,  హెచ్ కె ఊర్మిళ , ఎం విజయలక్ష్మి జరుగు, సాయి ప్రియాంక , ఆర్ ఉమా, మొయినమ్మ , పి సునీత, బి లలితగారు, ఎస్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. 

Tags: