ఎరుకల సమస్యలపై కలెక్టర్ కు వినతి
On
విశ్వంభర, రంగారెడ్డి:- జిల్లాలోని ఎరుకల సమస్యలపైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ ఎరుకల సమస్యల పైన, జిల్లా నిరుపేద ఎరుకల వారిని డివిజన్ వైజ్ గా అధికారులతో ఎంక్వయిరీ చేసి గుర్తించి. తెలంగాణ ప్రభుత్వం వలన వచ్చే ప్రభుత్వ పథకాలను ఎరకలవారికి అందేటట్లుగా కృషి చేయాలని వినతి అందించడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన వారిలో కోనేటి నరసింహ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉండ్రాతి రవి, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు



