చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా ప్రకటించాలి. -చాఐస ఫౌండర్ చైర్మన్ ఐదారి నాగిళ్ళ శంకర్
ట్యాంకుబండ్ పై వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.
విశ్వంభర, చండూర్ :- చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ రీ నెం 375/2010 ఫౌండర్ చైర్మన్ ఐదారి నాగిళ్ళ శంకర్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ట్యాంకుబండ్ పై వంద అడుగుల విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. రాబోయే తరాలకు జరగబోయే తెలంగాణలో నే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రపంచంలోని కొన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప నాయకురాలు అని కొనియాడారు. జయంతి వర్ధంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని మాజీ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కోఠి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మగా నామకరణం చేసిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ,అదే క్రమంలో చాకలి ఐలమ్మ ను తెలంగాణ తల్లి గా ప్రకటించి చాకలి ఐలమ్మ స్పూర్తికి ఐదు ఎకరాల స్మృతి భవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే రోజుల్లో ఐదారి కలం ద్వారా చాకలి ఐలమ్మ చిత్రాలు పంచడం, ప్రతిమలు ఇవ్వడం,ఐలమ్మ పురస్కారాలు అవార్డులు ఇవ్వడం జరుగుతూనే ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి చండూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ , భూతరాజు దేవదాసు,ఐతరాజు మల్లేష్,భూతరాజు శ్రీహరి,భూతరాజు నరేష్,భూతరాజు యాదగిరి,
భూతరాజు పాండు నలపరాజు శంకర్,కొండమీది లవకుమార్ భూతరాజు వెంకన్నలు భూతరాజు శేఖర్, ఏలే చంద్రశేఖర్ జన్ను,గంగిశెట్టి ప్రకాష్,జాంగిర్తదితరులు పాల్గొన్నారు



