ఘనంగా యువ నాయకుడు టిల్లు గౌడ్ జన్మదిన వేడుకలు
On
షాబాద్, విశ్వంభర:షాబాద్ మండల పరిధిలోని పెదవేడు గ్రామంలో యువ నాయకుడు టిల్లు గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘ నాయకులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కలిసి కేక్ కట్ చేసి టిల్లు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి పెదవేడు గ్రామ తొలి మాజీ సర్పంచ్, తెలంగాణ ఉద్యమకారుడు గౌండ్ల శ్రీనివాస్ గౌడ్ హాజరై టిల్లు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో గౌడ సంఘ నాయకులు, టిల్లు గౌడ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.



