అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. - కోడి శ్రీనివాసులు , మున్సిపల్ చైర్మన్ 

చండూరులో కాంగ్రెస్ నాయ‌కుల రాస్తారోకో.

అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. - కోడి శ్రీనివాసులు , మున్సిపల్ చైర్మన్ 

విశ్వంభర, చండూరు;- రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇండియా కూటమి నాయకుల  అరెస్టును ఖండిస్తూ చండూరులో కాంగ్రెస్ నాయ‌కులు గురువారం రాస్తారోకో చేశారు. ఈ సంద‌ర్భంగా మున్సిప‌ల్ ఛైర్మ‌న్ డా.కోడి శ్రీనివాసులు, మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు మేక‌ల సాగ‌ర్‌రెడ్డి, ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ఐత‌రాజు మ‌ల్లేష్‌లు మాట్లాడుతూ కేంద్ర‌ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను ఎంత‌మాత్రం స‌హించేది లేద‌ని, ఎంత‌కైన పోరాటం చేస్తామ‌ని తెలిపారు. నరేంద్ర మోడీ అమిత్ షా లు ఇండియా కూటమి నాయకుల పోరాటాన్ని ఆపలేరన్నారు. వీరి కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతుందని అన్నారు.  కేంద్ర ఎన్నిక‌ల అధికారి విఘ్నేశ్ కుమార్‌ను వెంట‌నే విధుల నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. అక్ర‌మ అరెస్టుల‌తో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నార‌ని, ప్ర‌జ‌లు అన్ని గ‌మ‌నిస్తున్నార‌ని, త‌గిన గుణ‌పాఠం చెప్తార‌ని అన్నారు. అర్హులైన వారి ఒక్క ఓటును తొల‌గించినా ఎంత మాత్రం స‌హించేది లేద‌ని, ఉద్య‌మాన్ని ఉదృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు దాడి చేయడం అత్యంత దుర్మార్గమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పై జరిగిన దాడితో సమానమని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ భూత‌రాజు ద‌శ‌ర‌థ , జిల్లా నాయ‌కుడు కాసాల జ‌నార్థ‌న్‌రెడ్డి, కౌన్సిల‌ర్ కోడి సుష్మ‌వెంక‌న్న‌, మండ‌ల,ప‌ట్ట‌ణ మ‌హిళా విభాగం అధ్య‌క్షులు పందిరి రాధా, కారింగు ప‌ల్ల‌వి, ఫ‌రీఫ్‌, మొగుదాల వెంక‌న్న‌, కోఆప్ష‌న్ ఖ‌లీలు, కాంగ్రెస్ ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంగెపు శ్రీను, నాయ‌కులు ప‌న్నాల లింగ‌య్య‌, కారింగు రామ్మూర్తి, నేర్ల‌కంటి ర‌వికుమార్, సుజావుదిన్, కన్నేబోయిన నాగరాజు, ఇరిగి వెంకటేశం, గండు వెంకట్ గౌడ్ , రమాదేవి, పంగ రామకృష్ణ, బొల్ల జనార్ధన్,  స‌త్యం, స‌ర్వేశ చారి తదిత‌రులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా.. షాబాద్‌లో సేవా సంకల్ప్ అభియాన్
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. - కోడి శ్రీనివాసులు , మున్సిపల్ చైర్మన్ 
ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026
ఎరుకల సమస్యలపై  కలెక్టర్ కు వినతి 
వర్షాలు సమృద్ధిగా కురవాలి. -కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం ప్రత్యేక పూజలు*
నేడు పేరు నమోదు కై గోడపత్రిక ఆవిష్కరణ.
 ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి- లక్ష్మీ దంపతులే మాకు ఆదర్శం  - కోడి శ్రీనివాసులు- అరుణ దంపతులు