నూతన డీసీసీ అధ్యక్షురాలు పరిజాత నర్సింహారెడ్డికి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అభినందనలు

నూతన డీసీసీ అధ్యక్షురాలు పరిజాత నర్సింహారెడ్డికి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అభినందనలు

విశ్వంభర, షాబాద్: రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నికైన పరిజాత నర్సింహారెడ్డిని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరిజాత నర్సింహారెడ్డిని ఘనంగా అభినందించిన మధుసూదన్ రెడ్డి, ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన బాధ్యతల్లో పరిజాత నర్సింహారెడ్డి విజయవంతంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు.

Tags: