భాజపా ప్రభుత్వానికి సిగ్గుందా - డా. కొదుమూరి దయాకర్ రావు
జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
- ఓట్ చోరీ తో బీజేపీ బండారం బట్టబయలు
- 13 కోట్ల ఓట్లు తొలగింపు - ప్రజాస్వామ్యంపై దాడి
- దేశ ప్రజలకు మోడీ , షా లు క్షమాపణలు చెప్పాలి.
విశ్వంభర, హైదరాబాద్ ;- ఓటు మన హక్కు ప్రజాస్వామ్యం మన బలం ఓటు హక్కును కాలరాస్తున్న బీజేపీ అసాంఘిక శక్తులపై కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పోరాటం చేస్తుంది. ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ని డిస్మిస్ చేసేదాకా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ , సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి డా. కొదుమూరి దయాకర్ రావు మండిపడ్డారు. సర్ ప్రక్రియ ద్వారా దేశంలో దాదాపు 13 కోట్ల ఓట్ల తొలగింపు హేయమైన చర్యగా భావిస్తూ , బీజేపీ పార్టీ అనుకూలమైన ఓట్లను ఆసరా చేసుకొని వారికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించడం సిగ్గుచేటు అని వారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజాపా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ను వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని కీలుబొమ్మలా ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని విపక్ష పార్టీలు, జెన్ జి యువత పెద్ద సంఖ్యలో నిరసనలు చేపడుతున్న బీజేపీ సర్కార్ కు సిగ్గుందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ఉద్యమానికి దేశ యువత, సామాన్య ప్రజలు మద్దతుగా పలుకుతున్నారని అన్నారు. వెంటనే భాజపా సర్కార్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్ ను రాజీనామా చేయించి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఓటర్ల అందరికీ న్యాయం చేయాలని కోరారు.



