చంద్రబాబు అనే నేను.. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత

చంద్రబాబు అనే నేను.. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత

చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, నవ్యాంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు.. మొత్తం నాలుగోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12న బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. 

ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడుసార్లు పనిచేయగా.. ఇప్పుడు ఆయన రికార్డును ఆయనే తిరగరాస్తూ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక తెలుగు నేతగా చంద్రబాబుకు ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు నాలుగోసారి అంటే.. ఏకంటా 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం అవుతుంది. ఆయనతో పాటు పవన్ కల్యాణ్‌, ఇతర మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు.

Related Posts