ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. కౌంటింగ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న రోజు వచ్చేసింది. విడతల వారీగా జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు(మంగళవారం) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. విడతల వారీగా జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు(మంగళవారం) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అధికారులు మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. దేశంలోని మొత్తం 543 స్థానాల్లో 8360 మంది అభ్యర్థులు పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఈ రోజుతో వారి భవితవ్యం తేలనుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ కొట్టి మోడీ వరుసగా మూడో సారి ప్రధాని అవుతారా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. లేక కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అనూహ్యంగా ఏమైనా ప్రభావం చూపించనుందా? అనేది చూడాల్సివుంది. ఏది ఏమైనా బీజేపీ శ్రేణులు మాత్రం గెలుపు ధీమాతో ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఎన్డీయే 350కి పైగా సీట్లు సాధిస్తుందని అంచనా వేస్తుండగా ఎన్డీయే కూటమి 400కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ ఎన్నికల ముందు నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్డీఏ అరుణాచల్ ప్రదేశ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. సూరత్‌లో ఎన్డీయే అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థులు, ఏజెంట్లు అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే, అన్ని పార్టీలు కౌంటింగ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్ ముగిసే వరకూ అక్కడే ఉండాలని పార్టీల అధినేతలు ఏజెంట్లకు సూచనలు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై అన్ని పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. గొడవలకు తావు లేకుండా అత్యంత భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసులు వెల్లడించారు.