విజయవాడ హైవేపై పోటెత్తిన వాహనాలు 

పంతంగి టోల్‌ప్లాజా వద్ద బారులు తీరిన కార్లు

విజయవాడ హైవేపై పోటెత్తిన వాహనాలు 

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (NH-65) జనసముద్రమైంది. తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైవే అంతా కిక్కిరిసిపోయింది.

విశ్వంభర, బ్యూరో: సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (NH-65) జనసముద్రమైంది. తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైవే అంతా కిక్కిరిసిపోయింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏపీ వైపు వెళ్లే వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో ట్రాఫిక్ నెమ్మదించింది. పంతంగి టోల్‌గేట్ వద్ద వాహనాల తాకిడి అత్యధికంగా ఉండడంతో ఫాస్టాగ్ ఉన్నప్పటికీ, వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడంతో గేట్ల వద్ద బారులు తీరుతున్నాయి. పెదకాపర్తి - చిట్యాల ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. జంక్షన్ల వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

తెల్లవారుజాము నుంచే ప్రయాణం
పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని చాలామంది ప్రయాణికులు తెల్లవారుజామునే ప్రయాణాన్ని ప్రారంభించారు. దీంతో తెల్లవారుజామున పంతంగి టోల్‌ప్లాజా మీదుగా రికార్డు స్థాయిలో వాహనాలు దాటినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రద్దీ దృష్ట్యా డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, హైవేపై వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Read More జనవరి 18న  సర్పంచ్ , ఉప సర్పంచ్ , వార్డ్ మెంబర్లకు ఘన సన్మానం 

Related Posts