కాజీపేటలో ఆల్ఫా ఒమేగా  మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఆశీర్వాద పండుగలు

రివరెండ్ నిఖిల్ జాన్ వెల్లడి

కాజీపేటలో ఆల్ఫా ఒమేగా  మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్  ఆశీర్వాద పండుగలు

విశ్వంభర, వరంగల్:- గ్రేటర్ వరంగల్ కాజీపేట పట్టణంలోని రైల్వే స్టేడియంలో ఆల్ఫా ఒమేగా  మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిషప్ జాన్ మార్కండేయ దైవ సేవకునిగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగాఈనెల 21, శుక్ర 22 శని 23 ఆదివారాల్లో జరిగే క్రైస్తవ ఆశీర్వాద పండుగలను క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పాస్టర్ రెవరెండ్ నిఖిల్ జాన్ డాక్టర్ దీవెన కుమారి బుధవారం మీడియాకు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బైబిల్ మిషన్ అధ్యక్షుడు రివరెండ్ సజీవరావు,బ్రదర్ అనిల్ కుమార్,గుంటూరు నుండి బ్రదర్,మాథ్యూస్ హాజరవుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సువార్త గాయకులు బ్రదర్ నిస్సి జాన్ టి సి ఎఫ్ సహకారంతో ఆశీర్వాద పండుగలను నిర్వహిస్తున్నామని, కుల, మత బేధము లేకుండా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వాద పండుగలను విజయవంతం చేయాలని రివరెండ్. నిఖిల్ జాన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బొక్క రమేష్. ఐలేష్.ధర్ల రాజు,అభిషేక్. మనోజ్,అద్విక్,అక్షయ్. సందీప్,తదితరులు పాల్గొన్నారు.

Tags: