సన్ షైన్ పాఠశాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

సన్ షైన్ పాఠశాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

విశ్వంభర, చండూరు:- మున్సిపాలిటీ కేంద్రంలోని సన్ షైన్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఆహ్లాదకర వాతావరణంలో క్రిబ్ మరియు క్రిస్మస్ ట్రీ అలంకరణలతో మరియు శాంతా క్లాస్ వేషధారణలో పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల కు బహుమతులను అందిస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో చిన్నారులు నృత్య రూపకాల ద్వారా క్రిస్మస్ యొక్క జననము గురించి వివరించారు. అదేవిధంగా పాటలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న గారు మాట్లాడుతూ జీసస్ యొక్క జీవన విధానం నిరాడంబరంగా అందరికీ ఆచరణీయంగా ఉన్నదని అన్నారు. సర్వ మతాలలో దేవుడు గొప్పవాడని, అందరూ దైవభక్తి కలిగి ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ గారు, ప్రిన్సిపల్ రవికాంత్, వినయ్, స్వప్న మేరీ, నిరీక్షణ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: