గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
On
విశ్వంభర, మహేశ్వరం : కందుకూరు పోలీస్ స్టేషన్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. సీతారాంకు నెదునూరు గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వారిని తనిఖీ చేయగా, గంజాయి లభించింది. కూకట్‌పల్లిలో ఉంటున్న మల్లిశెట్టి దుర్గా మల్లికార్జున రాజు, రామావత్ మోద మహేష్ నుంచి 10.61 కిలోల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేసిన వ్యక్తి శాంతి పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



