అంగన్‌వాడీ కేంద్రంలో అన్నప్రాసన
On
విశ్వాంభర,పెద్ద శంకరంపేట: పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం అన్నప్రాసన, సీమంతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ సూపర్వైజర్ శ్రీశైల హాజరై మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వార్డ్ సభ్యులు కూడా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించగా, గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏఎల్ఎంసీ కమిటీని సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. .ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కవిత, హేమలత, గ్రామస్తులు పాల్గొన్నారు.



