అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు సన్మానం
విశ్వంభర్, చండూరు: బంగారిగడ్డ గ్రామానికి చెందిన సుంకరి కృష్ణ, యాదమ్మల కుమారుడు సుంకరి మహేష్ గాంధీజీ విద్యాసంస్థలలో పదవ తరగతి వరకు చదివి ఇటీవల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం జనగామ ఆర్టిఏ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న సందర్భంగా స్థానికగాంధీజీవిద్యాసంస్థలలో గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు సుంకరి మహేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ తండ్రి ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తూ, కష్టపడి చదివించాడని, గ్రామీణ ప్రాంతంలో ఉండి, మంచి ఉద్యోగం సాధించిన సుంకర మహేష్ ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులందరూ కష్టపడి చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ఇన్చార్జి ప్రిన్సిపల్ కందుల కృష్ణయ్య, పాలకూరి కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



