అమ్మకు అమానుషం.. ఆస్తికోసం అంతిమయాత్ర ఆపిన కన్న పిల్లలు! 

అమ్మకు అమానుషం.. ఆస్తికోసం అంతిమయాత్ర ఆపిన కన్న పిల్లలు! 

అమ్మ ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది. అయితే అలాంటి అమ్మకు ఘోర అవమానం జరిగింది. అమ్మ చనిపోయిన ఆస్తి కోసం కన్న పిల్లలు ఏకంగా ఆమె అంతిమ యాత్రను ఆపివేసిన ఘటన సూర్య పేట జిల్లా కందులు వారి గూడెంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్నటువంటి వేము లక్ష్మమ్మ (80) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల మరణించింది.

ఈమెకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే లక్ష్మమ్మ వద్ద 20 తులాల బంగారు ఆభరణాలు, ఇరవై ఒక్క లక్షల విలువచేసే ఆస్తులు ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల కోసం తన ఐదుగురు పిల్లలు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ తన తల్లి అంత్యక్రియలను కూడా పక్కన పెట్టారు. 

Read More ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

ఆస్తి విషయం తేలేదాకా తన తల్లి అంత్యక్రియలు నిర్వహించేది లేదని గత రెండు రోజులుగా తన తల్లి అంత్యక్రియలు  జరపకుండా అడ్డుకున్నారు. గ్రామ పెద్దలతో కలిసి పంచాయతీ నిర్వహించిన ఈ గొడవ ఓ కొలిక్కి రాకపోవడంతో తన తల్లి అంత్యక్రియలను కూడా చేయకుండా ఉంచిన ఘటన చోటు చేసుకుంది. దీంతో వీరి వ్యవహార శైలిపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Related Posts

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా