యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి

యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి

  • ఇబ్రహీంపట్నం ఏసీపీ కెపీవి రాజు

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవి రాజు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్135 వ జయంతి సందర్భంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బండలేమురు గ్రామంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికీ ముఖ్య అతిధిగా హాజరుకావాలని సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ ఏసీపీ రాజును  మర్యాద పూర్వకంగా కలసి ఆహ్వానించారు. తల సేమియా బాధితుల కోసంఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగా రెడ్డి జిల్లా సహకారంతో  ఈ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని శంకర్ తెలిపారు. ఈ నెల 14న  ఉదయం 8.00 గంటల నుండి 2.00 గంటల వరకు రక్తదానం శిబిరం ఉంటుందని, గ్రామ యువకులు, ఆరోగ్యవంతులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 
 రక్తదానం చేయాలని ఆయన కోరారు.

Tags: