ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

  •   రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి 

 విశ్వంభర, సూర్యాపేట: పెన్పహాడ్ మండలం ఆనాజీ పురం గ్రామంలో ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐకెపి లను ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని,   తేమయంత్రాలు, ప్యాడి క్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లు, గన్ని బ్యాగులు కొరత లేకుండా చూడాలి అని సెంటర్ నిర్వాహకులకు ఆదేశించారు.ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం తక్కువగా ఉండేవిధంగా తూర్పారబెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. గ్రేడ్‌-ఏ ధాన్యానికి రూ. 2389, సాధారణ రకం ధాన్యానికి రూ.2369 మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలకే విక్రయించాలన్నారు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, ఎమ్మార్వో మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెడిమేలపు దామోదర్ రెడ్డి, సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్, మండల కాంగ్రెస్ నాయకులు నారాయణ ప్రవీణ్ రెడ్డి, భూక్య సందీప్ రాథోడ్, గ్రామ సర్పంచ్ అనుములపురి నాగయ్య, ఉప సర్పంచ్ చెన్ను స్వప్న భరత్ రెడ్డి, వార్డు సభ్యులు ముస్తఫా, ఎపియం అంజయ్య, ఎంపీవో రాజేందర్, చెన్ను జయమ్మ, మట్టపల్లి ఉపేందర్, అక్కేనపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: