సబ్ జైల్లో మెగా హెల్త్ క్యాంప్
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రం లోని సబ్ జైల్లో జైలర్ మల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు . మెగా హెల్త్ క్యాంపు లో ప్రభుత్వ వైద్యులు పాల్గొని జైలు ఖైదీల నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించారు . ఈసందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జైలర్ మల్లెల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజాపాలనలో భాగంగా సబ్ జైల్లో ఖైదీలకు ఆరోగ్యం, పరిశుభ్రత పై అవగాహన కల్పించామన్నారు. వైద్యాధికారుల సహకారంతో విచారణ ఖైదీలకు , మొబైల్ , ఎక్స్ రే , మెషీన్లతో ,పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. అయిదుగురు ప్రధాన డాక్టర్లతో సహా పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు, మెడికల్ వలంటీర్లు ఏకకాలంలో ప్రతి ఖైదీకి, జైలు సిబ్బందికి సైతం వైద్య సహాయం చెశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ పట్టేం బిక్షపతి, వడ్డేబోయిన శ్రీనివాస్, సిటిజన్ ఫోరమ్ సభ్యులు శంతన్ రామరాజు, మెడికల్ ఆఫీసర్లు ఏ. అర్జున్, అనిత, ప్రియాంక, కళ్యాణి, మౌనిక, అన్నపూర్ణ, శివరాం, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశా కార్యకర్తలు , ఇతర సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు .



