పాత టెండర్ విధానం అమలుకు  కృషి చేస్తా

పాత టెండర్ విధానం అమలుకు  కృషి చేస్తా

  •  ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుమార్

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: చేనేతకు నూతన టెండర్ విధానాన్ని రద్దు చేయించి పాత టెండర్ విధానాన్ని అమలు చేయించేందుకు తనవంతు కృషి చేస్తానని ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేనేత వర్గాల చైతన్య వేదిక, బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో చేనేతకు టెండర్ గండం- ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం పై ఉద్యమ కార్యాచరణ అనే అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనిల్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక మూడు దఫాలుగా ప్రభుత్వాలు వచ్చినప్పటికి చేనేత వర్గానికి చెందిన ఏ ఒక్క వ్యక్తి మంత్రి కాలేదన్నారు. పోరాటం ద్వారానే తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే 5 శాతం జిఎస్టిని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఆయనకు గుర్తు చేశారు. ముఖ్య మంత్రికి చేనేత వర్గాల పట్ల మంచి అభిప్రాయం ఉందని ఆయనకు అన్ని సమస్యలు వివరించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీ మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ, చేనేత రంగం అభివృద్దికి 500 కోట్లు కే టాయించడానికి ప్రభుత్వానికి మనస్సు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత రంగానికి న్యాయ బద్దంగా రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రభుత్వానికి కాంట్రాక్టులు, కమిషన్లు తప్ప మరోకటి పనికిరాదా అని ప్రశ్నించారు. చేనేతకు మరణ శాసనం రాస్తామంటే సహించబోమని ఆయన హెచ్చరించారు. సభకు అధ్యక్షత వహించిన చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిక్కా దేవదాసు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానం వల్ల చేనేత సహకార రంగాలు 70 శాతం మూతపడ్డాయని అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన చేనేత సహకార రంగాన్ని అభివృద్ధి చేయటంలో విఫలం చెందుతున్నాయని అన్నారు. చేనేత కళను కాపాడే బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, బీసీ పాలికల్ ప్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, బైరు శేఖర్, అంబాల నారాయణ గౌడ్, ఆప్ కో మాజీ చైర్మన్ కర్ణాటి వెంకటేష్, ఎయిర్టెల్ రాజు, గుజ్జ సత్యం, కూరపాటి రమేష్, ఎర్రమల్ల వెంకన్న, అవ్వారి భాస్కర్, సరస్వతి, లక్ష్మీ నరసయ్య, వనం శాంతి కుమార్, గట్టు వీరన్న, మనోహర్, బిక్షపతి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Tags: