వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల పరిశీలించిన ఎమ్మెల్యే

వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల పరిశీలించిన ఎమ్మెల్యే

  •  మండలంలో సుమారు 500ఎకరాల్లో పంట నష్టం 
  •  ప్రభుత్వానికి నివేదించి పరిహారం అందేలా చూస్తాం
  •  రైతులు ఆదౌర్యపడొద్దు..ఆదుకుంటామని భరోసా

విశ్వంభర,  నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు, మరియా తండా, బెలియా తండా, గోవింద్ పల్లి తదితర గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను నిజామాబాద్ రూరల్ నియోజవర్గ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి పరిశీలించారు. గురువారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయా గ్రామాల రైతులకు చెందిన పంట పొలాలను పరిశీలించి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించి పరిహారం అందేలా చూస్తామన్నారు. పలువురు రైతులు కంటతడి పెట్టుకోగా వారిని హక్కుల చేర్చుకుని అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, ప్రకృతి విపత్తు కారణంగా పంట నష్టం వాటిల్లడం దురదృష్టకరమన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నారని వారిని ఆదుకునేందుకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఈ విషయమై మాట్లాడినట్లు తెలిపిన ఎమ్మెల్యే.. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని పంట నష్టపరిహారం అందజేస్తుందని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ బాల్ రాజు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్, మునిపల్లి సాయి రెడ్డి, ముసుకు సాయి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు అమృతాపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్,ఉమ్మాజి, రామడుగు. విడిసి చైర్మన్ రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆనంద్, మహేందర్, నరేష్,హన్మండ్లు,కౌలాస్ మోహన్ , రాంచందర్ గౌడ్,మనోహర్ రెడ్డి,చిన్నా రెడ్డి,జనార్దన్ రెడ్డి,చెలిమె నర్సయ్య, ఏఎంసీ డైరెక్టర్ మంగ్త్య నాయక్ ఆయా గ్రామాల సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: