26న హిందూ సమ్మేళనం
On
విశ్వంభర, ఉప్పుగూడ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉప్పుగూడ రాఘవేంద్ర బస్తీలో ఈనెల ఏప్రిల్ 26 వ తేదీన హిందూ సమ్మేళనం జరుగనున్నది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఉప్పుగూడ శ్రీ మల్బార్ బాగ్ శివాలయంలో అధ్యక్షులు గుఱ్ఱం బొజ్జయ్య పంతులు ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శిగా గుండు శ్రీకాంత్ , కోశాధికారిగా రచ్చ శ్రీకాంత్ , జాయింట్ సెక్రెటరీగా నామని లోకేష్ గా నియమితులయ్యారు.



