చండ్ర రాజేశ్వరరావుకు ఘనంగా నివాళులు
On
విశ్వంభర, హిమాయత్‌నగర్ : కమ్యూనిస్టు ఉద్యమ ధ్రువతారగా చండ్ర రాజేశ్వరరావు నిలిచారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి. నరసింహ పేర్కొన్నారు. 32వ వర్థంతి సందర్భంగా హైదరాబాదు హిమాయత్‌నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్డూమ్ భవన్‌లో సీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు, అనగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడిగా ఆయనను గుర్తుచేశారు. తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం, రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నేతగా కొనియాడారు. కార్యక్రమంలో పల్లె నరసింహ, మరుపాక అనిల్ కుమార్, ఆరుట్ల రాజ్ కుమార్, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏ. గోవింద్ రావు, బోయ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.



