వివాహానికి 50కిలోల బియ్యం అందజేత

వివాహానికి 50కిలోల బియ్యం అందజేత

విశ్వంభర, సిద్దిపేట: తొగుట మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన దామరమైన రాజు-స్వరూప దంపతుల కూతురు శైలజ వివాహానికి వాసవి క్లబ్ సభ్యుడు గందె శ్రీనివాస్ గురువారం తన జన్మదినం సందర్భంగా 50కిలోల బియ్యం అందించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ నేతి వేణు కుమార్ మాట్లాడుతూ, క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో వివాహానికి బియ్యమే కాకుండా పేద మహిళల జీవనోపాధి కొరకు కుట్టుమిషన్లు, అవసరమైన సేవ కార్యక్రమాలు చేస్తున్న క్లబ్ కార్యవర్గసభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కూర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నాగమల్ల కిషన్, గ్రీటింగ్స్ ఛైర్మన్ మర్యాల వీరేశం, కాసనగోట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: