విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

విశ్వంభర, ముషీరాబాదు : విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాదు అజామాబాద్ విద్యుత్ కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిజన్, అన్‌మ్యాన్డ్, పీస్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ , వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించడంలో తాము నిరంతరం పనిచేస్తున్నప్పటికీ తగిన ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని కోరారు. టీజీఎన్‌పీడీసీఎల్, టీజీఎస్‌పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న అన్‌మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిజన్‌లలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ చంద్రరెడ్డి, నాయకులు స్వామి, కత్తి శ్రీను, సైదులు గౌడ్, శ్రీరాములు, బొడ్డు రమేష్, మహేందర్ రెడ్డి, హరీశ్, శ్రీకాంత్, ప్రవీణ్, లక్ష్మీ, సునీత, వీరమణి పాల్గొన్నారు.

Tags: