ఉస్మానియాలో క్రీడా పోటీలు
On
విశ్వంభర, హైదరాబాదు : ఎన్‌ఎస్‌యూఐ స్థాపన దినోత్సవం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌యూఐ యూనివర్సిటీ అధ్యక్షుడు మెధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అతిథులుగా తెలంగాణ రాష్ట్ర డైరీ అభివృద్ధి సంస్థ చైర్మన్ అజిత్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. విద్యార్థి దశలో క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని, శారీరక ఆరోగ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు, జట్టు భావన పెంపొందించడంలో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



