మొక్కలు ఎండిపోకుండా కాపాడాలి

మొక్కలు ఎండిపోకుండా కాపాడాలి

విశ్వంభర, నెల్లికుదురు: నర్సరీ లోని మొక్కలు ఎండిపోకుండా కాపాడుకోవాలని బొల్లికొండ చైతన్య నాగరాజు బాధ్యులకు సూచించారు. మండలంలోని మునిగలవీడు గ్రామ నర్సరీని పంచాయతీ కార్యదర్శి ఎండి సయ్యద్ అలీ తో కలిసి సర్పంచి గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు.మొక్కలకు నీరు పట్టారు. వేప,కానుగ,పండ్ల మొక్కలను పరిశీలించారు.ఈ సందర్భంగా మొక్కలను నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మొక్కల పర్యవేక్షణ పట్ల సంబంధిత బాధ్యులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సంరక్షించుకున్న మొక్కలనే పలుచోట్ల నాటాల్సి ఉంటుందని దీంతో పచ్చని గ్రామంగా మునిగలవీడు తయారవుతుందన్నారు. చెట్లతోనే జీవుల మనుగడ అని అన్నారు.

Tags: