ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో సభ్యత్వ  నమోదు  

ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో సభ్యత్వ  నమోదు  

విశ్వంభర,  మహాదేవపూర్:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు మాట్లాడుతూ, ఫీజు బకాయిలపై  హైకోర్టు తీర్పు సరికాదని అన్నారు. అదేవిధంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోండి ప్రభుత్వం రియంబర్స్మెంట్  ఇచ్చాక విద్యార్థులకు ఇవ్వండి అనే విషయంపై హైకోర్టు చెప్పడంపై  మండిపడ్డారు.పేద విద్యార్ధులు చదువులకు తీవ్ర నష్టం జరుగుతుందని  అన్నారు. ప్రభుత్వ హామీలతో కళాశాలలు విద్యార్ధులను చేర్చుకున్నారు. ఫీజుల కోసం విద్యార్ధులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  డిమాండ్ చేశారు.

Tags: